![]() |
![]() |
.jpg)
`క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. వరుస సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. `క్రాక్` తరువాత ఒప్పుకున్న `ఖిలాడి` చిత్రీకరణ తుదిదశలో ఉండగా.. రీసెంట్ గా శరత్ మండవ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. అలాగే `నేను లోకల్` డైరెక్టర్ త్రినాథరావ్ నక్కినతోనూ ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయనున్నారు. అంతేకాదు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితోనూ ఓ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు రవితేజ.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో యువ దర్శకుడికి మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ళ క్రితం మంచు లక్ష్మి, అడివి శేష్ ప్రధాన పాత్రల్లో `దొంగాట` చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ కృష్ణ.. రీసెంట్ గా రవితేజని సంప్రదించి ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వినిపించాడట. ఇంతవరకు తాను టచ్ చేయని జోనర్, రోల్ కావడంతో రవితేజ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిచూపిస్తున్నారట. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందంటున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `దొంగాట`లో రవితేజ ఓ పాటలో తళుక్కున మెరిశారు. కట్ చేస్తే.. ఆరేళ్ళ తరువాత అదే సినిమా దర్శకుడితో ఇప్పుడు ఫుల్ లెన్త్ మూవీ చేయనుండడం విశేషం. త్వరలోనే రవితేజ, వంశీ కృష్ణ కాంబో మూవీకి సంబంధించి క్లారిటీ రానున్నది.
![]() |
![]() |