![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `మజ్ను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. అనతి కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (అజ్ఞాతవాసి), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (నా పేరు సూర్య నా పేరు ఇండియా) వంటి స్టార్స్ తో జట్టుకట్టే అవకాశం దక్కించుకుంది. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన సదరు రెండు మెగా కాంపౌండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో.. అను `స్టార్ హీరోయిన్` లీగ్ లోకి చేరలేకపోయింది. ఆ చిత్రాల తరువాత వచ్చిన `శైలజా రెడ్డి అల్లుడు` కూడా నిరాశపడడంతో.. మిస్ ఇమ్మాన్యుయేల్ రెండేళ్ళ పాటు టాలీవుడ్ కి దూరమైంది.
కట్ చేస్తే.. `అల్లుడు అదుర్స్`తో రి-ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్ధ్ కాంబినేషన్ లో వస్తున్న `మహాసముద్రం`లో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు.. మరో సినిమాలో నటించే అవకాశం కూడా దక్కిందట. ఈ సారి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తో అను జోడీ కట్టబోతోందంటూ ప్రచారం సాగుతోంది. త్వరలోనే శిరీష్, ఇమ్మాన్యుయేల్ కాంబో మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |