![]() |
![]() |

`సవ్యసాచి` (2018)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. `మిస్టర్ మజ్ను`(2019)లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ తో చేసిన ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇలాంటి తరుణంలో.. `ఇస్మార్ట్ శంకర్` (2019) ఆఫర్ రావడం, ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిపోయింది నిధి.
కట్ చేస్తే.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`లో నటిస్తోంది మిస్ అగర్వాల్. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా
మూవీలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుంది నిధి. ఇదిలా ఉంటే.. తాజాగా నిధికి మరో క్రేజీ ఛాన్స్ దక్కిందట. ఈ సారి దగ్గుబాటి హ్యాండ్సమ్ హీరో రానాకి జంటగా నటించే అవకాశం నిధిని
వరించిందని టాక్. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించబోతున్నారని వినికిడి. త్వరలోనే రానా, నిధి కాంబో మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |