![]() |
![]() |

`మనం` తరువాత యువసామ్రాట్ నాగచైతన్య, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `థాంక్ యూ` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైతూకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ సందడి చేయనున్నారని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకరిగా మాళవికా నాయర్ కన్ఫామ్ అయిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక అతిథి పాత్రలో చైతూ శ్రీమతి, అగ్ర కథానాయిక సమంత నటిస్తుందంటూ ప్రచారం సాగుతోంది. కాగా, ఇప్పుడు మెయిన్ లీడ్ గా రాశీఖన్నా ఎంపికైందని టాక్. త్వరలోనే `థాంక్ యూ`లో రాశీఖన్నా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఇప్పటికే చైతూ - విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన `మనం`లో రాశి అతిథి పాత్రలో మెరిసింది. ఇక `వెంకిమామ`లో నాగచైతన్యకి జంటగా రాశీఖన్నా నటించిన విషయం విదితమే.
![]() |
![]() |