![]() |
![]() |
.jpg)
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కెండాల్ జెన్నర్ పేరు వినని వాళ్లు ఉండరు. టాప్ మోడల్‌గా రాణిస్తోన్న ఆమె టీవీ రియాలిటీ షోల ద్వారా సూపర్ పాపులర్ కూడా. ముఖ్యంగా 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్' షో ఆమెకు చాలా పేరు తెచ్చింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం ఆమె లాస్ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్ ఏరియాలో ఉన్న తన విలాసవంతమైన మాన్షన్‌ను వదిలేసి, బయటకు వచ్చేసింది. సాయుధ సెక్యూరిటీతో ఒక సురక్షిత ప్రదేశానికి వెళ్లింది. మళ్లీ తన ఇంటికి రావాలని ఆమె అనుకోవడం లేదట. ఆమె ఆ మల్టీ-మిలియన్ డాలర్ల భవంతిని కొని ఎంతో కాలం కాలేదు.
ఇంతకీ ఆమె ఆ ఇల్లొదిలి పెట్టి బయటకు వచ్చేయడానికి కారణమేంటో తెలుసా? వరుసగా ఆమె రెండు అనుకోని ఘటనలను ఎదుర్కోవడం. మొదట మార్చి 28న ఒక అపరిచిత యువకుడు బెవర్లీ హిల్స్ ఏరియాలోని కెండాల్ ఇంటి కిటికీలను అదేపనిగా తట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన బట్టలన్నీ విప్పేసి, న్యూడ్‌గా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టాడు. ఆ టైమ్‌లో కెండాల్ సెక్యూరిటీ ఆ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆ యువకుడి దృష్టిలో కెండాల్ పడలేదనీ, ఆమె క్షేమంగా ఉందనీ తెలిసింది. దౌర్జన్యంగా ఒకరి ఇంట్లోకి ప్రవేశించి, అభ్యంతరకరంగా ప్రవర్తించాడనే అభియోగంతో 27 సంవత్సరాల ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత లేటెస్ట్‌గా మతి స్థిమితం సరిగా లేని 24 సంవత్సరాల ఓ యువకుడు కెండాల్‌ను షూట్ చేయడం ద్వారా హత్యచేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశాడనే విషయం బయటపడింది.
ఆ రెండు వరుస ఘటనలతో బెంబేలెత్తిన కెండాల్ జెన్నర్ బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చుననుకొని, ఖరీదైనా ఇంటిని వదిలేసి, తన సెక్యూరిటీతో వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.

![]() |
![]() |