![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణని తెరపై ఎలా చూపిస్తే అభిమానులకు పూనకాలు వస్తాయో.. బాగా స్టడీ చేసేశారు మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. అందుకే.. బాలయ్యతో తీసిన రెండు సినిమాల్లోనూ దాన్ని బాగా అప్లయ్ చేశారు. రెండు సార్లూ బ్లాక్ బస్టర్ కి మించి రిజల్ట్స్ ఇచ్చారు. `సింహా`, `లెజెండ్`.. ఇలా బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాలయ్య, బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. `BB3` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా.. మే 28న సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
ఇదిలా ఉంటే.. `సింహా`, `లెజెండ్`లో యాక్షన్ సీక్వెన్స్ ని మాస్ కి ఫుల్ మీల్స్ అన్నట్లుగా తీర్చిదిద్దారు బోయపాటి. మరీ ముఖ్యంగా.. సదరు రెండు సెన్సేషనల్ హిట్స్ లోనూ ఇంట్రవెల్ బ్యాంగ్స్ `నెక్ట్స్ లెవల్` అన్నట్లుగా ఉంటాయి. ఇప్పుడిదే శైలిని `BB3`కి కంటిన్యూ చేస్తున్నారట బోయపాటి. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ గా వచ్చే ఇంట్రవెల్ బ్యాంగ్.. BB3కే మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుందని ఫిల్మ్ నగర్ బజ్. మరి.. బాలయ్య - బోయపాటి కాంబో ఇంట్రవెల్ బ్యాంగ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |