![]() |
![]() |
.jpg)
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. `ఆనంద్`, `గోదావరి`, `హ్యాపీ డేస్`, `ఫిదా`.. ఇలా ఈ సెన్సిబుల్ డైరెక్టర్ నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు తెలుగునాట క్లాసిక్స్ గా నిలిచాయి. త్వరలో శేఖర్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాబోతోంది. అదే.. `లవ్ స్టోరి`. యువ సామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ.. ఏప్రిల్ 16న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `లవ్ స్టోరి` తరువాత ఓ సీనియర్ స్టార్ తో శేఖర్ సినిమా చేయబోతున్నారని టాక్. ఆ స్టార్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేశ్. ఇటీవల వెంకీకి శేఖర్ ఓ ఆసక్తికరమైన కథ వినిపించారని, సబ్జెక్ట్ బాగా నచ్చడంతో వెంకీ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. అంతేకాదు.. వెంకీ ఏజ్, ఇమేజ్ కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని తెలిసింది. త్వరలోనే వెంకీ, శేఖర్ కమ్ముల కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
కాగా, వెంకీ తాజా చిత్రం `నారప్ప` మే 14న రిలీజ్ కానుంది. అలాగే `దృశ్యం`, `ఎఫ్ 3` చిత్రాలు కూడా ఇదే ఏడాదిలో వినోదాలు పంచనున్నాయి.
![]() |
![]() |