![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీగా తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ కోర్ట్ డ్రామా `పింక్` ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పవన్.. లాయర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రుతి హాసన్ నటించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య కనిపించనున్నారు. యువ సంగీత సంచలం తమన్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.
ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్`కి సంబంధించిన ట్రైలర్ ని మార్చి 29న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ ట్రైలర్ తాలూకు రన్ టైమ్ పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 2 నిమిషాల 4 సెకండ్ల పాటు ఈ ట్రైలర్ ఉంటుందట. అంతేకాదు.. పవన్ ఎలివేషన్ షాట్స్, సినిమాలోని కోర్ పాయింట్ ని ఈ ప్రచార చిత్రంలో హైలైట్ చేయనున్నారని టాక్. మరి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.
వేసవి కానుకగా ఏప్రిల్ 9న `వకీల్ సాబ్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |