![]() |
![]() |

ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ కథానాయికగా తనదైన ముద్ర వేస్తోంది తమన్నా భాటియా. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో ముందుకు సాగుతున్న ఈ `అభినేత్రి`.. ఈ ఏప్రిల్ ఫస్టాఫ్ లో సందడంతా తనదే అంటోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. `రచ్చ`, `బెంగాల్ టైగర్` తరువాత సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా నటించిన చిత్రం `సీటీమార్`. ఇందులో కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డిగా దర్శనమివ్వనుంది మిల్కీ బ్యూటీ. ఏప్రిల్ 2న ఈ స్పోర్ట్స్ డ్రామా థియేటర్స్ లోకి రానుంది. కట్ చేస్తే.. `సీటీమార్` రిలీజైన వారం రోజులకి అంటే ఏప్రిల్ 9న `ఆహా` ప్లాట్ ఫామ్ లో `లెవెన్త్ అవర్` అనే వెబ్ - సిరీస్ తో పలకరించబోతోంది మిస్ భాటియా. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇందులోనూ `రెడ్డి`గానే అలరించనుంది తమన్నా. ఆ పాత్ర పేరే.. అరత్రికా రెడ్డి.
మరి.. అటు థియేటర్స్ లోనూ, ఇటు ఓటీటీలోనూ `రెడ్డి`గానే ఎంటర్ టైన్ చేయనున్న తమన్నాకి రెండు చోట్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.
![]() |
![]() |