![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో దర్శనమివ్వనున్న చిత్రం `ఆదిపురుష్`. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో సీతగా `1 నేనొక్కడినే` ఫేమ్ కృతి సనన్ నటిస్తుండగా.. లంకేశ్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రభాస్ పై కొన్ని కీలక దృశ్యాలను తీస్తున్నట్లు టాక్.
ఇదిలా ఉంటే.. `ఆదిపురుష్`లో శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోందా? అని అతని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. `ఆదిపురుష్` ఫస్ట్ లుక్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 21న `ఆదిపురుష్`లోని శ్రీరామచంద్రమూర్తి పాత్రధారి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా, 2022 ఆగస్టు 11న `ఆదిపురుష్` ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |