![]() |
![]() |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మికా మందన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎలాంటిదో మనకు తెలుసు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో ఆ ఇద్దరి జోడీ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఆఫ్-స్క్రీన్ కూడా ఆ ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉంది. నిజానికి విజయ్ వాళ్లమ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ రష్మిక మెరిసింది. అంటే వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు.
విశేషమేమంటే ఇటు విజయ్, అటు రష్మిక కూడా దాదాపు ఒకేసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ 'లైగర్' మూవీ, రష్మిక 'మిషన్ మజ్ను' మూవీ షూటింగ్ జరుపుకుంటున్నాయి. దాంతో ప్రస్తుతం ఆ ఇద్దరూ ముంబైలోనే ఉన్నారు. లేటెస్ట్‌గా అక్కడి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడానికి వెళ్లిన ఆ ఇద్దరూ కెమెరా కంటికి చిక్కారు.

విజయ్ బ్లూ టి-షర్ట్, ఖాకీ షార్ట్స్ వేసుకొని రెస్టారెంట్‌కు వస్తే, కామ్‌ఫీ హుడీలో సింపుల్ బట్ బ్యూటిఫుల్‌గా కనిపించింది రష్మిక. గమనించాల్సిన విషయమేమంటే, ఇద్దరూ ఒకే విధమైన మాస్క్ ధరించి ఉండటం. సో.. ముంబైలోనూ ఈ బ్యూటిఫుల్ ఆన్-స్క్రీన్ కపుల్ కలుసుకుంటున్నారని అర్థమవుతోంది.

రష్మిక 'మిషన్ మజ్ను' సినిమాతో పాటు తెలుగులో అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమా చేస్తోంది. తమిళంలో కార్తీ జోడీగా నటించిన 'సుల్తాన్' సినిమాతో పరిచయం కాబోతోంది.
![]() |
![]() |