![]() |
![]() |

`ఎఫ్ 2` చిత్రంలో భార్యాబాధితుడి పాత్రలో వినోదాలు పంచారు విక్టరీ వెంకటేశ్. ఫ్రస్ట్రేటేడ్ హజ్బండ్ గా `ఫన్`టాస్టిక్ గా నటించారాయన. కట్ చేస్తే.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`లో మరోసారి బాధితుడి పాత్రలో సందడి చేయనున్నారు. అయితే, ఈ సారి కేవలం భార్యాబాధితుడిగానే కాదు రేచీకటి బాధితుడిగానూ వెంకీ నవ్వులు పంచనున్నారట. కథానుసారం.. వెంకీ క్యారెక్టర్ కి రేచీకటి సమస్య వస్తుందని.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు గిలిగింతలు పెట్టేలా ఉంటాయని బజ్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `ఎఫ్ 3`లో వెంకీతో పాటు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. డబ్బు నేపథ్యంలో సాగే ఈ కొనసాగింపు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ఆగస్టు 27న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |