![]() |
![]() |

`గబ్బర్ సింగ్` (2012) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. జూన్ లేదా జూలైలో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో పవన్ క్యారెక్టర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. పొలిటికల్ లీడర్ గా మారే లెక్చరర్ గా పవర్ స్టార్ దర్శనమిస్తారట. ఆయనను రాజకీయాల్లోకి తీసుకెళ్ళే ఘట్టాలే.. సినిమాకి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని టాక్. అంతేకాదు.. పవన్ ఇమేజ్ ని మరింత పెంచేలా కథానాయకుడి పాత్రను డిజైన్ చేసుకున్నారట హరీశ్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు వేచిచూడాల్సిందే.
కాగా, పవన్ తాజా చిత్రం `వకీల్ సాబ్` ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి రానుంది. బాలీవుడ్ కోర్ట్ డ్రామా `పింక్` ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
![]() |
![]() |