![]() |
![]() |

సినీ, టీవీ నటి కరాటే కల్యాణి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కల్యాణి తక్కువ రోజుల్లోనే ఇంటి బాట పట్టేసి ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత టీవీ షోల్లో దర్శనిమిస్తూ ఆకట్టుకుంటున్న ఆమె కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తున్న నేపథ్యంలోనూ వార్తల్లో నిలిచారు. అన్నీ ప్రైవేట్‌వే అయినప్పుడు ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.
తాజాగా మరో వివాదంతో ఆమె వార్తల్లోకి ఎక్కారు. టీవీ సీరియల్స్ లో నటించడం బాగా తగ్గించిన కరాటే కల్యాణి క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం వంటి పలు సమస్యలపై పోరాడారు. తాజాగా 'లవ్ జిహాద్'పై వార్ ప్రకటించారు. 'లవ్ జిహాద్'కు గురైన ఓ యువతికి న్యాయం చేయాలంటూ వాయిస్ వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా 'లవ్ జిహాద్'పై రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య అనే అమ్మాయి 'లవ్ జిహాద్'కు గురైందని, తాసీఫ్ అనే వ్యక్తి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని, పెళ్లి తరువాత దివ్యను చిత్రహింసలకు గురిచేశారని, ఇప్పుడు తలాఖ్ అని చెప్పి దివ్యకు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతను ఎక్కడున్నా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కరాటే కల్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![]() |
![]() |