![]() |
![]() |
.jpg)
కేరళకుట్టి కీర్తి సురేశ్ కెరీర్ లో మేలిమలుపుగా నిలిచిన చిత్రం `మహానటి`. ఆ సినిమాకి ముందు తెలుగునాట కీర్తి నటించిన `నేను శైలజ`, `నేను లోకల్` మంచి విజయం సాధించాయి. అయితే, ఎటొచ్చి `మహానటి` తరువాత తనకు ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. `సర్కార్`, `పందెం కోడి 2`, `సామి` వంటి తమిళ అనువాద చిత్రాలు - `మన్మథుడు 2` (అతిథి పాత్ర)తో పాటు ఓటీటీ మూవీస్ `పెంగ్విన్`, `మిస్ ఇండియా`.. ఇలా కీర్తి నటించిన సినిమాలన్నీ తెలుగునాట తనకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
ఇలాంటి తరుణంలో.. కీర్తికి కాస్త రిలీఫ్ ఇచ్చింది రీసెంట్ గా రిలీజైన `జాతిరత్నాలు` చిత్రం. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో అతిథి పాత్రలో కాసేపు తళుక్కున మెరిసింది కీర్తి సురేశ్. నవీన్ తో సాగే ఈ ట్రాక్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్సే వస్తోంది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. మొత్తమ్మీద.. `మహానటి` తరువాత ట్రాక్ తప్పిన కీర్తికి.. `జాతిరత్నాలు` రూపంలో కాస్త ఉపశమనం దక్కినట్లయింది.
కాగా, కీర్తి నటించిన తాజా చిత్రం `రంగ్ దే` ఈ నెల 26న థియేటర్స్ లో సందడి చేయనుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |