![]() |
![]() |

కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలన్నది వారి అభిమానుల కోరిక. `కడైకుట్టి సింగమ్` (తెలుగులో `చినబాబు`)తో ఆ ముచ్చట కాస్త తీర్చారు దర్శకుడు పాండిరాజ్. కార్తి కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో సూర్య అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు సూర్యకి కార్తిని అతిథిగా చేసే పనిలో ఉన్నారట సేమ్ డైరెక్టర్. ఆ వివరాల్లోకి వెళితే.. సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా పాండిరాజ్ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించనున్నారు. ఈ వారంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలోనే కార్తి స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నారట. అంతేకాదు.. సూర్య, కార్తి మధ్య వచ్చే సన్నివేశం `కడైకుట్టి సింగమ్` తరహాలో కనువిందుగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే సూర్య - పాండిరాజ్ కాంబో మూవీలో కార్తి గెస్ట్ రోల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి.. `కడైకుట్టి సింగమ్` తమిళనాట సెన్సేషనల్ హిట్ అయిన నేపథ్యంలో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |