![]() |
![]() |

టాలీవుడ్‌లో వున్నయంగ్ హీరోల్లో రుద్రరాజు శ్రీవిష్ణు మృదు స్వభావి, బిడియస్తుడు.. అన్న విషయం చాలా మందికి తెలుసు. అలాంటి శ్రీవిష్ణుని ఓ పక్క స్టార్ కమెడియన్ అలీ, మరో పక్క స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస పంచ్‌లతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఓ ఆట ఆడేసుకున్నారు. అలీ వరుస ప్రశ్నలతో ఊపిరాడకుండా చేస్తే, అనిల్ రావిపూడి మాత్రం శ్రీవిష్ణు చెప్పాల్సిన సమాధానాలు తానే చెప్పేస్తూ ఆడుకున్నాడు.
ఈ ఇద్దరి మధ్య శ్రీవిష్ణు బిడియంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఈటీవీలో ప్రతీ సోమవారం ప్రసారం అవుతున్న పాపులర్ టాక్ షో 'ఆలీతో సరదాగా'. స్టార్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీవిష్ణు ఈ వారం అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ వేసిన ప్రశ్నలకు శ్రీవిష్ణు కొంత ఇబ్బంది పడుతూ సమాధానాలు చెబుతుంటే.. మధ్యలో అనిల్ రావిపూడి కలగజేసుకుని తానే సమాధానాలు చెప్పడం నవ్వులు పూయిస్తోంది.
"అమ్మాయిలంటే భయమంటకదా.. అలాంటిది ప్రేమించి పెళ్లి ఎలా చేసుకున్నావ్?" అని అలీ హీరో శ్రీవిష్ణుని అడగడం.. దానికి "గౌరవం కాబట్టే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ"ని అనిల్ రావిపూడి చెప్పడం.. ఆ తరువాత, ఎక్కువ సార్లు నువ్వు చూసిన సినిమా ఏంటని అలీ అడిగితే 'నువ్వునాకు నచ్చావ్' చిత్రాన్ని దాదాపు 72 సార్లు చూశానని శ్రీవిష్ణు చెప్పడం... అయితే ఆ మూవీలోని డైనింగ్ టేబుల్ సీన్‌లో వెంకటేష్ చెప్పే వంటల పేర్లు చెప్పమని అలీ అడగడం... దానికి ఆలు ఫ్రైని శ్రీవిష్ణు మరిచిపోవడం.. దాన్ని గుర్తు చేసిన అలీ నేను అడిగింది చెప్పమన్నానే కానీ నీకు నచ్చింది మాత్రమే చెప్పమనలేదని పంచ్ వేయడం నవ్వులు కురిపిస్తోంది. ఈ సోమవారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
![]() |
![]() |