![]() |
![]() |

'జాతిరత్నాలు' మూవీని, ఆ సినిమా టీమ్‌ను ప్రశంసల్లో ముంచేశాడు అల్లు అర్జున్. ఆ మూవీ హీరో నవీన్ పోలిశెట్టినైతే "రైజ్ ఆఫ్ ఎ న్యూ ఏజ్ స్టన్నింగ్ పర్ఫార్మర్" అంటూ ఆకాశానికెత్తేశాడు. నిన్న రాత్రి ఆయన 'జాతిరత్నాలు' సినిమా చూశాడు. ఈ రోజు ఉదయం ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశాడు.
"రాత్రి 'జాతిరత్నాలు' చూశాను. మొత్తం టీమ్‌కు అభినందనలు. హిలేరియస్ మూవీ. ఇటీవలి సంవత్సరాల్లో ఇంతగా నేనెప్పుడూ నవ్వలేదు. స్టెల్లార్ పర్ఫార్మెన్స్‌తో నవీన్ పోలిశెట్టి బాగా ఆకట్టుకున్నాడు. రైజ్ ఆఫ్ ఎ న్యూ ఏజ్ స్టన్నింగ్ పర్ఫార్మర్. రాహుల్ రామకృష్ణ బ్రిలియంట్‌గా, అనాయాసంగా నటించాడు. ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, మిగతా ఆర్టిస్టులందరూ బాగా చేశారు. టెక్నీషియన్స్ అందరికీ నా అభినందనలు. రధన్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాతలు నాగ్ అశ్విన్, స్వప్న సినిమా, ప్రియాంక దత్, అశ్వినీదత్ గార్లు, వారి కన్విక్షన్‌పై నా గౌరవం పెరిగింది. ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ అనుదీప్‌కు నా ముఖ్యమైన రెస్పెక్ట్ తెలియజేస్తున్నా. అందరూ తమ బ్రెయిన్స్‌ను స్విచ్చాఫ్ చేసి, ఈ సినిమా చూసి, అందులోని ఫన్‌ను ఎంజాయ్ చేయండి." అని రాసుకొచ్చాడు బన్నీ.
మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైన 'జాతిరత్నాలు' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆద్యంతం హిలేరియస్‌గా నవ్విస్తోన్న ఈ సినిమా మంచి మౌత్ టాక్‌తో రన్ అవుతోంది.

![]() |
![]() |