![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ `ఆచార్య`. ఇందులో `ఆచార్య`గా టైటిల్ రోల్ లో చిరు దర్శనమివ్వనుండగా.. సిద్ధగా చరణ్ సందడి చేయనున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సమ్మర్ స్పెషల్ గా మే 13న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. `ఆచార్య`లో మొత్తం ఆరు పాటలుంటాయని టాక్. `ఆచార్య` ఇంట్రో సాంగ్, రెజీనాతో `ఆచార్య` స్పెషల్ సాంగ్, కాజల్ తో `ఆచార్య` డ్యూయెట్, మహాశివుడిపై డివోషనల్ సాంగ్, ఆచార్య - సిద్ధ కాంబో సాంగ్, పూజా హెగ్డేతో సిద్ధ డ్యూయెట్.. ఇలా ఆణిముత్యాల్లాంటి ఆరు గీతాలతో `ఆచార్య` తెరకెక్కిందట. మరో రెండు నెలల్లో సినిమా విడుదల కానున్న సందర్భంగా ఒక్కో సింగిల్ ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరి.. చాన్నాళ్ళ తరువాత చిరు - మణి కాంబోలో వస్తున్న ఈ ఆల్బమ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |