![]() |
![]() |

అందర్నీ షాక్‌కు గురిచేస్తూ తమిళ పాపులర్ డైరెక్టర్ ఎస్.పి. జననాథన్ తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇయర్కై, పేరన్‌మై, ఈ, పురంపొక్కు ఎనుమ్ పోదువుడమై లాంటి చిత్రాలతో ఎంతో కీర్తి సంపాదించుకున్న ఆయనను నిన్న సాయంత్రం ఆయన అసిస్టెంట్లు అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
గురువారం ఆయన తన లేటెస్ట్ ఫిల్మ్ 'లాబమ్' ఎడిటింగ్ పనులు చూస్తూ, భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. ఎంతకీ జననాథన్ ఎడిటింగ్ స్టూడియోకు తిరిగి రాకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అసిస్టెంట్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆయన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు.
జననాథన్ క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారనీ, ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యిందనీ వినిపిస్తోంది. హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్స్ ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. లాబమ్ హీరో విజయ్ సేతుపతితో పాటు డైరెక్టర్లు అమీర్, కరు పళనియప్పన్ తదితరులు గురువారం రాత్రి హాస్పిటల్‌కు వెళ్లారు కానీ, జననాథన్‌ను చూసేందుకు వారిని అనుమతించలేదు.
అయితే, తర్వాత విజయ్ సేతుపతి ఒక్కరిని అనుమతించారు. జననాథన్ లేటెస్ట్ ఫిల్మ్ 'లాబమ్'లో విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించారు. జగపతిబాబు ఓ కీలక పాత్ర చేశారు. రెండు నెలల క్రితం ఆ సినిమా టీజర్ విడుదలై, మంచి రెస్పాన్స్ సాధించింది. తొలిచిత్రం 'ఇయర్కై'తోటే జననాథన్ నేషనల్ అవార్డ్ సాధించడం విశేషం.

![]() |
![]() |