![]() |
![]() |
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు పాన్-ఇండియా మూవీస్ ఉన్నాయి. వాటిలో 'ఆదిపురుష్' ఒకటి. 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీరామునిగా టైటిల్ రోల్ లో దర్శనమివ్వనున్నారు ప్రభాస్. లంకేశ్ (రావణుడు) పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. సీత పాత్రలో కృతి సనన్, కీర్తి సురేశ్.. ఈ ఇద్దరిలో ఒకరు నటించే అవకాశముందంటూ కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. 'ఆదిపురుష్'లో లక్ష్మణుడి పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. విక్కీ కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ వర్గాల సమచారం. త్వరలోనే 'ఆదిపురుష్'లో విక్కీ కౌశల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, విక్కీ కౌశల్ ప్రస్తుతం 'సర్దార్ ఉధమ్ సింగ్', 'ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' చిత్రాల్లో నటిస్తున్నాడు.
మరి.. 2022 ఆగస్టు 11న రాబోతున్న 'ఆదిపురుష్'.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |