![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్స్ లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. నవీన్ పోలిశెట్టికి జోడీగా ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమాకి 'పిట్టగోడ' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా పతాకంపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ని నిర్మించారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'` తరువాత నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన సినిమా కావడం.. పాటలు, ప్రచార చిత్రాలు ఇంప్రెసివ్ గా ఉండడంతో.. 'జాతిరత్నాలు'పై మంచి బజ్ నెలకొని ఉంది.
ఇదిలా ఉంటే.. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రానున్న 'జాతిరత్నాలు' సినిమాకి సంబంధించిన రన్ టైమ్ పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 145 నిమిషాల (2 గంటల 25 నిమిషాలు) డ్యూరేషన్ తో 'జాతిరత్నాలు' సాగుతుందట. మరి.. క్రిస్ప్ రన్ టైమ్ తోనే వస్తున్న ఈ 'జాతిరత్నాలు' ప్రేక్షకరత్నాలని ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.
మురళీ శర్మ, బ్రహ్మానందం, నరేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, గిరిబాబు, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖ తారాగణం ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన 'జాతిరత్నాలు'కి రథన్ సంగీతమందించారు.
![]() |
![]() |