![]() |
![]() |

మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాలే.. 'శ్రీకారం', 'జాతిరత్నాలు', 'గాలి సంపత్'.
వ్యవసాయం గొప్పదనం తెలిపే కథతో రూపొందిన 'శ్రీకారం'లో శర్వానంద్, 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ జంటగా నటించగా.. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'జాతిరత్నాలు'లో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న 'గాలి సంపత్'లో రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్ లీ సింగ్ ముఖ్య పాత్రల్లో అభినయించారు. విభిన్న కథాంశాలతో జనం ముందుకు వస్తున్న ఈ మూడు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 'శ్రీకారం', 'జాతిరత్నాలు', 'గాలి సంపత్' ఈ మూడు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే సెన్సార్ జరుపుకోగా.. మూడింటికి కూడా 'యు' సర్టిఫికేట్ దక్కింది. ఒకే వారంలో థియేటర్లోకి వస్తున్న మూడు సినిమాలు ఇలా 'యు' సర్టిఫికేట్ పొందడం.. అరుదైన అంశమనే చెప్పాలి. మరి.. ఆల్ సెక్షన్ ఆడియన్స్ ని ఈ చిత్రత్రయాలు ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తాయో చూడాలి.

![]() |
![]() |