![]() |
![]() |

`అర్జున్ సురవరం`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో `18 పేజెస్`, `కార్తికేయ 2` చిత్రాలు ఉన్నాయి. `కుమారి 21 ఎఫ్` ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో `18 పేజెస్` తెరకెక్కుతుండగా.. `కార్తికేయ`కి సీక్వెల్ గా రూపొందనున్న `కార్తికేయ 2`కి చందు మొండిటినే దర్శకుడు.
ఇదిలా ఉంటే.. `18 పేజెస్`లో నిఖిల్ కి జోడీగా కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, `కార్తికేయ 2`లో కూడా అనుపమనే నాయిక ఎంపికయ్యిందని సమాచారం. `ప్రేమమ్` తరువాత చందు మొండేటి దర్శకత్వంలో అనుపమ నటించనున్న సినిమా ఇదే కావడం విశేషం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తన కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు స్వాతితోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్స్మ్ చేశాడు నిఖిల్. `స్వామి రారా`, `కార్తికేయ` చిత్రాల కోసం వెంటవెంటనే స్వాతితో కలసి నటించి అప్పట్లో వార్తల్లో నిలిచాడు నిఖిల్. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ ఇప్పుడు అనుపమతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుండడం విశేషమనే చెప్పాలి.
త్వరలోనే `కార్తికేయ 2`లో అనుపమ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |