![]() |
![]() |

తన ప్రీవియస్ మూవీ `క్రాక్`లో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తో రొమాన్స్ చేశారు మాస్ మహారాజా రవితేజ. శ్రుతి ఫ్యాక్టర్.. సదరు కాప్ డ్రామాకి బాగానే అచ్చొచ్చింది. కట్ చేస్తే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `ఖిలాడి`లో మాత్రం అందుకు భిన్నంగా అంతగా పేరు లేని హీరోయిన్స్ తో జోడీ కట్టారు రవితేజ. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం మీనాక్షి చౌదరి, డింపుల్ హయతితో కలసి నటిస్తున్నారు మాస్ మహారాజా.
కట్ చేస్తే.. `ఖిలాడి` తరువాత రాబోతున్న త్రినాథరావ్ నక్కిన డైరెక్టోరియల్ విషయంలోనూ ఇదే ఫార్ములాని కొనసాగించబోతున్నారట ఈ సీనియర్ హీరో. #RT 68గా తెరకెక్కనున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో ఐశ్వర్యా మీనన్, శ్రీలీల నాయికలుగా ఎంపికయ్యారని టాక్. ఐశ్వర్యకి ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన అనుభవం ఉంది. ఇక శ్రీలీల విషయానికి వస్తే.. `పెళ్ళి సందడి` నయా వెర్షన్ లో నాయికగా నటిస్తోంది.
మరి.. అంతగా గుర్తింపు లేని హీరోయిన్లతో రవితేజ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
![]() |
![]() |