![]() |
![]() |

విలక్షణ పాత్రలో అల్లరి నరేశ్ నటించిన 'నాంది' చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను రాబడుతోంది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ డ్రామా నైజాం ఏరియాలో లాభాలను చవిచూస్తోంది. విడుదలకు ముందు బజ్ లేకపోవడం, నరేశ్‌కు మార్కెట్ వాల్యూ పడిపోవడంతో నైజాం ఏరియాకు కేవలం 70 లక్షల మేరకే ఈ సినిమా అమ్ముడైంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఈ సినిమా వసూళ్లను రాబడుతోంది.
తొలి రెండు రోజుల కంటే మూడు, నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే నైజాంలో రూ. 90 లక్షల షేర్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే ఇప్పటికే ఈ సినిమా లాభాల్లోకి వచ్చిందన్న మాట. రానున్న రోజుల్లో మరింత షేర్ వచ్చే అవకాశాలుండటంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.
చేయని హత్యానేరంతో జైలుపాలై, అండర్ ట్రయల్ ఖైదీగా హింసను ఎదుర్కొంటూ వచ్చే హీరోగా అల్లరి నరేశ్, అతడి తరపున కోర్టులో వాదించి, అతడిని బయటకు తీసుకు వచ్చే పవర్‌ఫుల్ లాయర్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
![]() |
![]() |