![]() |
![]() |

'నువ్వు నేను' హీరోయిన్ అనిత, రోహిత్ రెడ్డి దంపతులకు ఫిబ్రవరి 9న పండంటి పుత్రుడు జన్మించాడు. పది రోజుల తర్వాత తమ కుమారుడి పేరును వారు వెల్లడించారు. అవును.. అనిత కొడుకు పేరు ఆరవ్ రెడ్డి. అయితే ఆ పేరును ప్రకటించింది.. అనిత కానీ, రోహిత్ కానీ కాదు. బాలీవుడ్ లేడీ కమెడియన్ భారతీ సింగ్. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ వీడియో ద్వారా ఆమె ఆ బుడతడి పేరును వెల్లడించింది. ఆరవ్ రెడ్డి పేరు మీద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు, తాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు ఆమె ఆ వీడియోలో చూపించింది.
అంతకు ముందు ఫిబ్రవరి 9న రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన భార్య అనితతో తీయించుకున్న బ్యూటిఫుల్ పిక్చర్‌ను షేర్ చేసి, తమకు బేబీ బాయ్ పుట్టినట్లు వెల్లడించాడు. అప్పట్నుంచీ, ఆ బుడతడికి ఏం పేరు పెడతారని ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఫైనల్లీ, భారతీ సింగ్ అతడి పేరును ప్రకటించింది. ఆరవ్ అంటే ప్రశాంతత అనీ, అల్లరి అనీ రెండు అర్థాలు ఉన్నాయి. అనిత దంపతులు ఏ అర్థంతో ఆ పేరు పెట్టారో మరి!

రెండు రోజుల క్రితం తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా తమ బుడ్డోడితో కూడిన ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసింది అనిత. ఆ ఫొటోలో కొడుకును అనిత చేతుల్లో పట్టుకొని ఉంటే, భర్త రోహిత్ ఆమెను పొదివి పట్టుకొని కనిపిస్తున్నాడు. అయితే కొడుకుకు దిష్టి తగలకుండా, అతని ముఖం కనిపించకుండా, ఓ ఎమోజీని పెట్టింది. "And just like that we were three! Blessed with the best! Thank you to each one of you for your beautiful wishes. #newmommydaddy." అంటూ ఆమె రాసుకొచ్చింది.

![]() |
![]() |