![]() |
![]() |

`చి ల సౌ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది సోయగం.. రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే ఇక్కడవారిని విశేషంగా ఆకర్షించింది మిస్ శర్మ. ఆపై `హిట్`, `డర్టీ హరి` చిత్రాలలోనూ సందడి చేసింది. ఈ మూడు సినిమాలు కూడా సర్ ప్రైజ్ హిట్స్ గా నిలిచి.. రుహానీని హ్యాట్రిక్ హీరోయిన్ చేశాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు ఈ టాలెంటెడ్ బ్యూటీ `101 జిల్లాల అందగాడు`లో నాయికగా నటించింది. అవసరాల శ్రీనివాస్ ఇందులో కథానాయకుడిగా నటించగా.. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దిల్ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ వినోదాత్మక చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 7న `101 జిల్లాల అందగాడు` థియేటర్స్ లో సందడి చేయనుంది.
మరి.. రుహానీ సక్సెస్ కహానీ `101 జిల్లాల అందగాడు`తోనూ కొనసాగుతుందేమో చూడాలి.
![]() |
![]() |