![]() |
![]() |

2016 సంక్రాంతి విజేత 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. 'బంగార్రాజు' పేరుతో త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాలోనూ కింగ్ నాగార్జున రెండు పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. తండ్రి బంగార్రాజు పాత్రకి జోడీగా అలనాటి అందాల నటి రమ్యకృష్ణనే కొనసాగుతుండగా.. తనయుడు రాము పాత్రకి జంటగా లావణ్య త్రిపాఠికి బదులు మరో నాయిక దర్శనమివ్వనుందని టాక్.
తాజా సమాచారం ప్రకారం.. ఆ పాత్రలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించే అవకాశముందని తెలిసింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. ఇటీవల కాజల్ తో సంప్రదింపులు జరిపారని.. కథ, పాత్ర నచ్చడంతో కాజల్ కూడా వెంటనే ఓకే చెప్పారని బజ్. త్వరలోనే 'బంగార్రాజు'లో కాజల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో 'మోసగాళ్ళు', 'ఆచార్య' చిత్రాలు ఉన్నాయి. 'మోసగాళ్ళు'లో మంచు విష్ణుకి చెల్లెలిగా కాజల్ నటించగా.. 'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా ఆమె దర్శనమివ్వనున్నారు. 'మోసగాళ్ళు' మార్చి 11న థియేటర్స్ లోకి రానుండగా.. 'ఆచార్య' మే 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
![]() |
![]() |