![]() |
![]() |

ఒకరు రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఇంకొకరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇద్దరూ కలిసి 'బిల్లా', 'రెబల్' సినిమాల్లో కలిసి నటించారు. 'రెబల్' మూవీలో అయితే తండ్రీకొడుకులుగా కనిపించారు. నిజ జీవితంలో ప్రభాస్‌కు కృష్ణంరాజు పెదనాన్న అనే విషయం తెలిసిందే. కృష్ణంరాజుకు కొడుకులు లేరు. అందుకని తమ్ముని కొడుకుని తన కొడుకుగానే ఆయన ట్రీట్ చేస్తుంటారు. కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలను సొంత చెల్లెళ్లుగానే భావిస్తుంటాడు ప్రభాస్.
పోతే.. మంగళవారం కృష్ణంరాజు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఒక పిక్చర్ ఇప్పుడు నెట్టింట వీర విజృంభణ చేస్తోంది. ఆ పిక్చర్‌లో ప్రభాస్‌తో కలిసి కృష్ణంరాజు ఇచ్చిన పోజు అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇద్దరూ పక్కపక్కనే నిల్చొని, కళ్లకు గాగుల్స్ పెట్టి, రెండు చేతులనూ తలవెనుక పెట్టి, స్టైల్‌గా పోజు ఇచ్చారు ఇద్దరూ. ప్రభాస్ రెట్రో లుక్‌లో అదరగొడుతున్నాడు.
ఆ ఫొటోకు "ప్రభాస్‌తో 70ల నాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. జూలై 30న రాధేశ్యామ్‌తో ఆ కాలానికి తిరిగి వెళ్దాం!" అని క్యాప్షన్ జోడించారు కృష్ణంరాజు. ఆయన ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది సమయంలోనే ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ దీన్ని లైకులతోటీ, రిట్వీట్‌లతోటీ విపరీతంగా వైరల్ చేసేశారు.

![]() |
![]() |