![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేయనున్నారు. అందులో ఒకటి నారప్ప కాగా.. మరొకటి ఎఫ్ 3. మే 14న నారప్ప రిలీజ్ కానుండగా.. ఆగస్టు 27న ఎఫ్ 3 విడుదల కానుంది.
అయితే వీటిలో ఎఫ్ 3 రిలీజ్ డేట్ ఆగస్టు 27.. గతంలో వెంకీకి చేదు ఫలితాన్ని అందించిందనే చెప్పాలి. ఎందుకంటే.. 1999లో ఇదే తేదిన విడుదలైన వెంకీ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ శీను.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. అదే తేదికి 22 ఏళ్ళ తరువాత వస్తున్న ఎఫ్ 3తోనైనా వెంకీ సక్సెస్ చూస్తాడేమో చూడాలి.
2019 నాటి సంక్రాంతి విజేత ఎఫ్ 2కి సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్ 3లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండగా.. తమన్నా భాటియా, మెహరీన్ నాయికలుగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
![]() |
![]() |