![]() |
![]() |

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన తొలి వెబ్ సిరీస్.. లైవ్ టెలీకాస్ట్. శుక్రవారం (ఫిబ్రవరి 12) నుంచి ఈ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపిలో స్ట్రీమ్ అవుతోంది. ప్రధానంగా తమిళంలో రూపొందినా.. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ అనువాద రూపంలో అందుబాటులో ఉందీ హారర్ వెబ్ సిరీస్.
టాక్ సంగతి పక్కన పెడితే.. ఈ సిరీస్ లో కాజల్ కాస్త రెచ్చిపోయిందనే చెప్పాలి. అక్కడక్కడ స్మోకింగ్ సీన్స్ తోనూ.. అలాగే ఎఫ్ వర్డ్స్ తోనూ షాక్ ఇచ్చిందీ అమ్మడు. ట్రెండీ గా సాగే షో డైరెక్టర్ రోల్ లో ఎప్పటిలాగే కాజల్ తన యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టినప్పటికీ.. కొన్ని అంశాలు మాత్రం ఆమె అభిమానులకు మింగుడు పడేలా లేవనే చెప్పాలి. మరి.. మున్ముందు కూడా కాజల్ ఈ తరహా పాత్రల్లో కొనసాగుతుందేమో చూడాలి.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వైభవ్, ఆనంది ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
![]() |
![]() |