![]() |
![]() |

రంగస్థలంతో మెగా కాంపౌండ్ హీరోలతో సినిమాలు చేయడం అనే అంకానికి శ్రీకారం చుట్టింది హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిచిన ఈ చిత్రం తరువాత.. సుప్రీమ్ హీరో సాయితేజ్ తో చిత్రలహరి చేసింది మైత్రీ. తాజాగా సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తోనూ ఉప్పెన చేసింది. చిత్రలహరి విజయం సాధించగా.. ఉప్పెన కూడా పాజిటివ్ టాక్ ని మూటగట్టుకుంది.
అంతేకాదు.. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప చేస్తున్న ఈ క్రేజీ ప్రొడక్షన్ హౌస్.. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో బాబీ డైరెక్టోరియల్ చేయబోతోంది. వీటిలో పుష్ప ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుండగా.. పవన్, చిరు ప్రాజెక్ట్స్ వచ్చే ఏడాది తెరపైకి రానున్నాయి.
కాగా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోనూ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మొత్తమ్మీద.. మెగా కాంపౌండ్ ని బాగానే రౌండప్ చేసేసింది ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.
![]() |
![]() |