![]() |
![]() |

విజేత, హిట్లర్, అన్నయ్య, డాడీ.. ఇలా పలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో అలరించారు మెగాస్టార్ చిరంజీవి. 'అందరివాడు' తరువాత ఎందుకనో మళ్ళీ ఆ జోనర్ జోలికి వెళ్ళలేదు చిరు. ఎక్కువగా సోషల్ డ్రామాలనే చేస్తూ వచ్చారు. అయితే, త్వరలోనే మెగాస్టార్ నుంచి ఓ కుటుంబ కథా చిత్రం రానుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్, జై లవ కుశ, వెంకిమామ చిత్రాల దర్శకుడు బాబీతో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాదు.. మెగాభిమానులు ఆశించే అన్ని అంశాలకూ ఈ చిత్రంలో స్థానముందట. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, చిరు - బాబీ మూవీలో కథానాయికగా శ్రుతి హాసన్ నటించే అవకాశముందని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉందని బజ్.
![]() |
![]() |