![]() |
![]() |

యంగ్ టైగర్ యన్టీఆర్, 'కేజీఎఫ్' కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు కూడా కథనాలు వచ్చాయి.
తాజాగా ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ ధ్రువీకరించారు. 'ఉప్పెన' ప్రచారపర్వంలో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్, ప్రశాంత్ కాంబినేషన్ మూవీ గురించి చెప్పుకొచ్చారు. 'సలార్' తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే సినిమా.. యన్టీఆర్ దేనని వారు తెలిపారు. మరి.. యన్టీఆర్ 31గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ప్రస్తుతం తారక్.. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నారు. అనంతరం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో యన్టీఆర్ 30 చేయనున్నారు.
![]() |
![]() |