![]() |
![]() |

డైరెక్టర్ నంబర్ వన్ రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్'తో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మల్టిస్టారర్ మూవీ.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ పిరియడ్ డ్రామా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత జక్కన్న.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. యాక్షన్ ఎడ్వెంచరెస్ మూవీగా మహేశ్ - జక్కన్న కాంబో ప్రాజెక్ట్ ఉంటుందట. అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం రచయిత విజయేంద్రప్రసాద్ కథను తయారుచేస్తున్నారని.. అలాగే ఆఫ్రికా అడవుల్లో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే మహేశ్-జక్కన్న కాంబో మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చేస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.
![]() |
![]() |