![]() |
![]() |

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి 2021 ఎంతో ప్రత్యేకం కానుంది. ఈ సంవత్సరం అరడజనుకి పైగా సినిమాలతో సందడి చేయనున్నారీ టాలెంటెడ్ కంపోజర్. మరీ ముఖ్యంగా.. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో డీఎస్పీ దే హవా. వరుసగా మూడు నెలల్లో మూడు సినిమాలతో అంటే నెలకో సినిమాతో పలకరించనున్నారు ఈ స్వరతరంగం.
ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో అల్లుడు అదుర్స్ తో జనవరిలో ఎంటర్ టైన్ చేసిన డీఎస్పీ.. ఫిబ్రవరిలో ఉప్పెనతో అలరించనున్నారు. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ ప్రేమకథా చిత్రం.. ఫిబ్రవరి 12న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక మార్చిలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ రంగ్ దే తో పలకరించనున్నారు డీఎస్పీ. నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చి 26న రిలీజ్ కానుంది.
మొత్తమ్మీద.. 2021 ఫస్ట్ క్వార్టర్ లో డీఎస్పీదే హవా అన్నమాట.
కాగా, ఇదే ఏడాదిలో దేవిశ్రీ ప్రసాద్ బాణీలతో రూపొందుతున్న ఖిలాడి, పుష్ప, ఎఫ్ 3 కూడా విడుదల కాబోతున్నాయి.
![]() |
![]() |