![]() |
![]() |

రామ్ చరణ్ ప్రస్తుతం యస్.యస్. రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', తండ్రి చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న 'ఆచార్య' సినిమాలు చేస్తున్నాడు. వాటి తర్వాత అతను ఏ డైరెక్టర్‌తో వర్క్ చేస్తాడనే విషయం ఇంతదాకా వెల్లడి కాలేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్‌లలో ఒకరైన శంకర్‌తో అతను పనిచేసే అవకాశం ఉంది. ఈ మేరకు కోలీవుడ్ నుంచి లీకులు వస్తున్నాయి. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ఇది రూపొందుతుందనీ, ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడనీ ఆ లీకుల సారాంశం.
దిల్ రాజు చాలా కాలంగా శంకర్ డైరెక్షన్‌లో మూవీని ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి 'ఇండియన్ 2' (భారతీయుడు 2)ను ఆయన నిర్మిస్తారని ప్రచారం జరిగింది కూడా. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఆ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కొద్ది కాలంగా శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ కోసం దిల్ రాజు ప్రయత్నిస్తూ వచ్చారనీ, అది దాదాపు ఓ కొలిక్కి వచ్చిందనీ అంతర్గత వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడైతే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
కాగా 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్‌తో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. బ్రిటీష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్నాడు చరణ్. అతని జోడీగా అలియా భట్ నటిస్తోంది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానున్నది.
![]() |
![]() |