![]() |
![]() |

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఆంధ్రా అంతా అట్టుడుకుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలంటూ వేలాది జనం రోడ్డెక్కారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన నటి కరాటే కల్యాణీ మాత్రం ఈ ఉద్యమంపై సంచలన కామెంట్‌లు చేస్తోంది.
మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కరక్టే కానీ ప్రధాని మోదీ ఆలోచించకుండా నిర్ణయం తీసుకోరని, ఆయనంటే నచ్చని వాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడింది. "ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వారు అంతా ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులనే వాడుతున్నారా? ప్రైవేట్ వస్తువుల్ని వాడటం లేదా? ఎయిర్ టెల్, జియో ఏంటివన్నీ?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
గత కొంత కాలంగా హిందుత్వ వాదన వినిపిస్తున్న కరాటే కల్యాణీ బీజేపీ పార్టీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా విశాఖ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
![]() |
![]() |