![]() |
![]() |

సెన్సేషనల్ హిట్ కేజీఎఫ్ ఛాప్టర్ 1తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ కథానాయకుడు యశ్. త్వరలోనే కేజీఎఫ్ ఛాప్టర్ 2తో పలకరించనున్నాడు. కేజీఎఫ్ ఛాప్టర్ 1ని రూపొందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కగా.. జూలై 16న వరల్డ్ వైడ్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 తరువాత యశ్ నటించబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్ సిరీస్ తరహాలోనే తన తదుపరి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగానే ప్లాన్ చేశాడట ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు.. ఈ సినిమా మఫ్టీ వంటి బ్లాక్ బస్టర్ కన్నడ మూవీని రూపొందించిన నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కనుందని సమాచారం.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదలయ్యేలోపే ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనుందని శాండల్ వుడ్ బజ్. మరి.. ఈ సినిమాతో రాకీ భాయ్ స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
![]() |
![]() |