![]() |
![]() |

బిగ్‌బాస్ ఆటమ్‌బాంబ్ అరియానా. సీజన్ 4లో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిచ్చరపిడుగు తనదైన మార్కు ఆట తీరుతో అందిరినీ ఆకట్టుకుంది. టాప్ ఫైవ్ వరకు హౌస్‌లో నిలిచి చాలా మందికి హాట్ ఫేవరేట్‌గా మారింది. ఫైనల్ స్టేజ్‌లో హౌస్‌లో సోహైల్‌తో అరియానా చేసిన ఆర్గ్యూమెంట్... తను తీసుకున్న స్టాండ్ ఒక్క క్షణంలో సోహైల్‌ని విలన్ని చేసేసింది... అంతాలా ప్రభావితం చేసిన అరియానాపై చాలా మంది సెలబ్రిటీలు కన్నేశారు.

ముందు కర్చీఫే వేసేశారు వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఓ ఇంటర్య్యూలో అరియానాని "నిన్ను బికినీలో చూడాలని వుంద"ని ఓపెన్ గానే చెప్పేసి ఆమెకు గాలమేసిన వర్మ తాజాగా మరోసారి అరియానాని గోవాలో పట్టేసుకున్నారు. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొని ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లోకి వచ్చేసిన అరియానా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తోంది. తాజాగా ఈ వయ్యారి గోవా చెక్కేసింది.
అక్కడి వర్మతో కలిసి ఫొటోలకి పోజులిచ్చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. రెడ్ కలర్ ట్రెండీ వేర్‌లో వర్మతో క్లోజ్‌గా అరియానా మూవ్ అవుతున్న ఫొటోలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మరోసారి వర్మకి అరియానా అడ్డంగా దొరికిపోయింది.. అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. అంతేనా అరియానాకు వర్మ హీరోయిన్ గా అవకాశం ఇచ్చి వుంటాడని అంతా గుసగుసలాడుతున్నారు. మరి ఈ వార్తలపై అరియానా ఏమంటుందో..
![]() |
![]() |