![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ కార్తికి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన తమిళ చిత్రాల్లో ఆయిరత్తిల్ ఒరువన్ ఒకటి. తెలుగులో ఈ సినిమా యుగానికి ఒక్కడు పేరుతో అనువాదమై ఇక్కడా ఆదరణ పొందింది. ఈ సినిమా తరువాతే తెలుగులో కార్తి చిత్రాలు వరుసగా డబ్బింగ్ కావడం ప్రారంభించాయి. అలాంటి ఆయిరత్తిల్ ఒరువన్ కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైంది. కాకపోతే, ఈ సీక్వెల్ లో కార్తి నటించడం లేదు. మరో తమిళ స్టార్ హీరో ధనుష్ సందడి చేయనున్నాడు.
అంతేకాదు.. ఆయిరత్తిల్ ఒరువన్ ని డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ నే ఈ సీక్వెల్ ని కూడా తెరకెక్కించనున్నాడు. ఓ ఏడాది పాటు పూర్వ నిర్మాణ కార్యక్రమాలకే సమయం కేటాయించి.. 2022లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు. అలాగే 2024లో ఈ కొనసాగింపు చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. మొదటి భాగం కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే రెండో భాగం కథ మొదలవుతుందట. మరి.. కార్తికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమాకి సంబంధించిన సీక్వెల్ లో ధనుష్ ఏ స్థాయిలో రంజింపజేస్తాడో చూడాలి.
![]() |
![]() |