![]() |
![]() |

2019లో 'మజిలీ', 'వెంకీమామ' రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. 2021లోనూ ఈ టాలెంటెడ్ స్టార్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆంగ్ల శీర్షికలతోనే ఆయా సినిమాలు సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో చైతూ చేసిన 'లవ్ స్టోరీ', విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'థ్యాంక్ యూ'.. రెండు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ తోనే తెరకెక్కుతున్నాయి. మరి.. 2021లోనే రానున్న ఈ సినిమాలతో చైతూ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
కాగా, 'లవ్ స్టోరీ'లో డ్యాన్స్ మాస్టర్ గా దర్శనమివ్వనున్న చైతూ.. 'థ్యాంక్ యూ'లో హాకీ ప్లేయర్ గా కనిపించున్నట్లు సమాచారం. తక్కువ గ్యాప్ లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |