![]() |
![]() |

నూతన సంవత్సరారంభం సందర్భంగా బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో తను డైరెక్ట్ చేసే సినిమాకు 'యానిమల్' టైటిల్ ప్రకటించాడు 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా. పరిణీతి చోప్రా నాయికగా నటించే ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రధారులు.
టైటిల్‌ను రివీల్ చేస్తూ, నిర్మాణ సంస్థ టి-సిరీస్ షేర్ చేసిన ఆడియో టీజర్ 'యానిమల్'పై ఉత్కంఠతను బాగా పెంచేస్తోంది. ఉద్వేగభరితమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో, తన తండ్రితో రణబీర్ కపూర్ మాట్లాడే మాటల్ని ఈ టీజర్‌లో మనం వినొచ్చు. గన్‌షాట్స్ సౌండ్‌తో ఈ ఆడియో టీజర్ ముగిసింది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రణబీర్ సినిమా చేయనుండటం ఇదే తొలిసారి. బాబీ డియోల్ విలన్‌గా కనిపించనుండటం విశేషం. రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నారు.
రణబీర్ కపూర్ చివరగా 2018లో వచ్చిన సంజయ్ దత్ బయోపిక్ సంజులో కనిపించాడు. 2021లో షంషేరా, బ్రహ్మాస్త్ర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని సంయుక్తంగా నిర్మించనున్న యానిమల్ మూవీ 2021 మధ్యలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
![]() |
![]() |