![]() |
![]() |

తొలిసారి ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ అంబరాన్నంటుతున్న అంచనాలు వెల్లువెత్తుతున్న చిత్రం 'రాధేశ్యామ్'. పూజా హెగ్డేతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే రొమాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తక్కువ టైమ్‌లోనే అత్యధిక వ్యూస్‌తో 'రాధేశ్యామ్' పోస్టర్లు హిస్టరీ క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో కనిపించనుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హుషారుగా ఉన్నారు.
నూతన సంవత్సరారంభం సందర్భంగా 'రాధేశ్యామ్'లోని తన స్టిల్‌తో ఉన్న పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు ప్రభాస్. దానికి "To all my lovely fans, wishing you a Happy & Healthy 2021." అంటూ క్యాప్షన్ జోడించాడు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో షేర్ చేసిన ఆ పోస్టర్‌లో ప్రభాస్‌లో చూడముచ్చటగా, రెట్రో లుక్‌లో కనిపిస్తున్నాడు. బ్లాక్ డ్రస్‌లో నేలపై వాలుగా కూర్చొని ఒక పక్కకు తలతిప్పి చూస్తున్నాడు. తలకు క్యాప్ ఉంది. ఎక్కడ్నుంచే జర్నీ చేస్తున్నవాడిలో బ్యాక్‌ప్యాక్ నేలపై పెట్టి ఉంది. ఆ పోస్టర్‌లో ప్రభాస్ చార్మింగ్ లుక్స్‌కు ప్రేమలో పడనివాళ్లుంటారా! అన్ని అంచనాలనూ దాటుతున్న 'రాధేశ్యామ్' లేటెస్ట్ పోస్టర్‌తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టింది. రొమాన్స్, ఫన్, డ్రామా మేళవించిన ఫిల్మ్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నట్లు ఆ పోస్టర్ ప్రామిస్ చేస్తోంది.
పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న 'రాధేశ్యామ్'లో ప్రభాస్, పూజా హెగ్డే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ప్రభాస్ తల్లిగా ప్రేమపావురాలు తార భాగ్యశ్రీ నటిస్తోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తున్న ఈ మూవీని గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

![]() |
![]() |