![]() |
![]() |

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌కు మంగళవారం కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం విదితమే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే ఆయన భార్య ఉపాసనకు టెస్ట్‌లో నెగటివ్ రావడం ఊరటనిచ్చే అంశం. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మంగళవారం రాత్రి ప్రకటించారు. చరణ్‌తో కలిసి తాను కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాననీ, ప్రస్తుతం తనకు నెగటివ్ వచ్చినా కొవిడ్ పాజిటివ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందనీ ఆమె చెప్పడం గమనార్హం.
పచ్చిక మీద వేసున్న ఓ టేబుల్‌పై తామిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూర్చున్న పిక్చర్‌ను షేర్ చేసిన ఉపాసన, దానికి "Quarantine with Mr. C" అనే క్యాప్షన్ జోడించారు. భర్తను ఆమె "మిస్టర్ సి" అంటూ సంబోధిస్తుంటారు. "దీన్ని కూడా దాటేస్తాం. బెటర్ 2021 కోసం ఆశాభావంతో ఉన్నాం. కొవిడ్ లక్షణాలేమీ లేవు. మిస్టర్ సి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. నాకు నెగటివ్‌గా తేలింది. కానీ నాకు కొవిడ్ పాజిటివ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు మిస్టర్ సితో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. గోరువెచ్చని ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ, వేడి ఆవిరి పీలుస్తూ, విశ్రాంతి తీసుకుంటున్నాం." అని ఆమె రాసుకొచ్చారు.
క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేసుకొని, 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలు ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా అని చరణ్ ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |