![]() |
![]() |

ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లోకి రాలేకపోతున్నాననీ, ఈ విషయంలో అభిమానులను క్షమించమని కోరుతున్నాననీ మంగళవారం సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన ఆయన అభిమానుల్లో కలకలం రేపింది. జనవరిలో పార్టీ పేరును ప్రకటించాల్సిన సందర్భంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఫ్యాన్స్ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అయితే ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారంటూ నటి నగ్మా అభినందించారు.
రాజకీయ నాయకురాలిగా మారిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన నగ్మా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రజనీతో తానున్న రెండు పిక్చర్స్‌ను షేర్ చేసి, "రజనీకాంత్ జీ, మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నా. మంచి నిర్ణయం. మొదట ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నికల రాజకీయాల్లోకి రాకుండానే ప్రజల కోసం మంచి పనులు చేయవచ్చు." అని ఆమె రాసుకొచ్చారు. ఆ పోస్ట్‌కు "#RajinikanthPoliticalEntry #NoworNever" అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు.
రజనీకాంత్‌ను సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్‌గా మార్చిన 'బాషా' చిత్రంలో హీరోయిన్ నగ్మాయే. ఆ మూవీకి ఆమె గ్లామర్ అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది.

![]() |
![]() |