![]() |
![]() |

మలయాళ చిత్రాలు చూసే తెలుగు ప్రేక్షకులకు నజ్రియా నజీమ్ ఫహద్ పరిచయమే. 'బెంగళూరు డేస్' సహా పలు మలయాళ చిత్రాల్లో ఆమె నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఎంతో మంది! అనువాద చిత్రం 'రాజా రాణి' ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆమె వచ్చారు. ఆ చిత్రంలో ఆర్యను ప్రేమ వివాహం చేసుకుని ప్రమాదంలో మరణించిన అమ్మాయిగా కనిపిస్తారు. ఇప్పుడామె తెలుగు తెర మీదకు రావడానికి సిద్ధమవుతున్నారు.
నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో నానికి జోడీగా నజ్రియా నటించనున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి నజ్రియా తెలుగు నేర్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆమె తెలుగు పాఠాలు వింటున్నారు. అంతేకాదు... ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెబుతానని దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నజ్రియా చెప్పారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 'టక్ జగదీష్', 'శ్యాం సింగరాయ్' చిత్రీకరణలు పూర్తి చేసి ఈ సినిమా సెట్స్ మీదకు నాని రానున్నారు.
![]() |
![]() |