![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. దాంతో సినిమాకు పర్మనెంట్ గా ప్యాక్అప్ చెప్పేశారామె. 'సర్కారు వారి పాట' షూటింగ్ ఇంకా స్టార్ట్ కానే కాలేదు... అప్పుడే హీరోయిన్ షూటింగ్ పార్ట్ ఫినిష్ కావడం ఏమిటని అనుకుంటున్నారా!? మహేష్ హీరోగా నటించనున్న సినిమాకి సంబంధించిన విషయం కాదిది... మహేష్ నిర్మాతగా చేస్తున్న సినిమాకు సంబంధించిన విషయం!
సోనీ పిక్చర్స్ సంస్థ తో కలిసి మహేష్ నిర్మిస్తున్న సినిమా 'మేజర్'. ఇందులో అడివి శేష్ హీరో. తెలుగు అమ్మాయి... హిందీ వెబ్ సిరీస్ లు, సినిమాలతో పేరు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ హీరోయిన్. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన వీర సైనికులు, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.


![]() |
![]() |