![]() |
![]() |

'ఖైదీ'తో తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఆ సినిమా అందించిన ఘనవిజయంతో కోలీవుడ్ స్టార్ విజయ్ కాంబినేషన్‌లో 'మాస్టర్' చిత్రం చేసే అవకాశం అందుకున్నారు. ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్‌లో సందడి చేసే అవకాశముంది.
కాగా, ఈ సినిమా నిర్మాణం పూర్తి కాగానే లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో 'విక్రమ్' చిత్రాన్ని ఆరంభించారు లోకేష్ కనకరాజ్. అంతేకాదు.. శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2021 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లోకేష్. ఈ మేరకు టైటిల్ టీజర్ లోనే విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు కూడా.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్స్‌తో లోకేష్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |